Realme Narzo 70 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ (Realme) తన రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్‌ను ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. దీని ధర రూ.30 వేల లోపే ఉండొచ్చునని భావిస్తున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ తో అందుబాటులోకి రానున్నది. ఈ ఫోన్ డ్యూ టచ్ గ్లాస్’ ఫీచర్‌తో వస్తున్నది. రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ తో ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను రీ డిఫైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ పూర్తిగా గ్లాస్ డిజైన్ తో వస్తున్నది.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 వర్షన్ పై రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్, 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.