RBI | అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. లాభాల కోసం రిస్క్ తీసుకోవద్దన్న శక్తికాంత దాస్..!
RBI | లాభాలు గడించడానికి బ్యాంకులు కొన్ని రకాల రిస్కులు చేయడం సరి కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇటువంటి చర్యలతో ఏమాత్రం లాభాలు రావన్నారు.
RBI | లాభాలు గడించడానికి బ్యాంకులు కొన్ని రకాల రిస్కులు చేయడం సరి కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇటువంటి చర్యలతో ఏమాత్రం లాభాలు రావన్నారు. గురువారం ఆయన కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సంక్షోభాలను ముందే పసిగట్టి వాటి నివారణకు చర్యలు తీసుకోవడమే ఆర్బీఐ బాధ్యత అన్నారు. అయితే ప్రతి సారీ సంక్షోభాలు గుర్తించలేం కానీ అందుకు వందశాతం ప్రయత్నిస్తామని చెప్పారు.
బ్యాంకులు సెక్యూరిటీ రహిత రుణాలు మంజూరు చేసే విషయమై ఆర్బీఐ సరైన సమయానికి తగు చర్యలు తీసుకోవడం వల్లే మార్కెట్ కొంత మందగించిందని శక్తికాంత దాస్ చెప్పారు. లేకపోతే ఇందులో బలహీనతలు పెరిగిపోయి సమస్య తీవ్రమయ్యేదన్నారు. వ్యాపారం పెరుగుదలకు చేసే ఆలోచనలు మంచివైనా.. ఏమాత్రం ఆమోదించలేని నిర్ణయాలు తీసుకోరాదన్నారు.
బలమైన రిస్క్ నియంత్రణ వ్యవస్థతోనే సుదీర్ఘకాలంలో విజయం సాధించవచ్చునని శక్తికాంత దాస్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టంగా మారుతున్నప్పుడు మన పర్యవేక్షణ వ్యూహాలూ సమయానుకూలంగా ఉండాలన్నారు. అలాగని నియంత్రణ నిబంధనలు తరుచుగా మార్చడం తమ ఉద్దేశం కాదన్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద మొండి బకాయిలు గణనీయంగా తగ్గడంతో దేశీయ ఫైనాన్సియల్ వ్యవస్థ బలంగా ఉందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

