PNB Festive offer | పీఎన్బీ ఫెస్టివల్ ధమాకా.. ఈ రుణాలపై చార్జీలు మాఫీ!
PNB Festive offer | పండుగల సీజన్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ బోనంజా....

PNB Festive offer | పండుగల సీజన్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ బోనంజా ఆఫర్ పేరిట తమ ఖాతాదారులకు చౌకగా రుణ పరపతి కల్పిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై సర్వీస్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను మాఫీ చేసింది.
హోం లోన్, వెహికిల్ లోన్, మై ప్రాపర్టీ లోన్స్, పర్సనల్ లోన్స్, పెన్షన్ లోన్స్, గోల్డ్ లోన్స్‌కు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ప్రస్తుతం 6.80 శాతం వడ్డీరేటుపై హోంలోన్లు, 7.15 శాతం వడ్డీపై కారు లోన్లు మంజూరు చేస్తున్నది. పర్సనల్ లోన్లపై 8.95 శాతం వసూలు చేస్తున్నది.
హోంలోన్‌పై ఆకర్షణీయ వడ్డీతో టాపప్ రుణం అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 2021 డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఖాతాదారులు దేశవ్యాప్తంగా తమ శాఖలు, డిజిటల్ చానెళ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

