ఆక్సిమీటర్ల ధర రెట్టింపు!

- డిమాండ్ పెరగడంతో రెండింతలైన రేటు
- మార్కెట్లో కంపెనీని బట్టి 1000- 2,500
- డిస్ట్రిబ్యూటర్ ధర రూ.1,300-1,600
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): శరీరంలో జ్వర తీవ్రతను చూసుకోవడానికి థర్మామీటర్ ఉన్నట్టే.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గుర్తించి అప్రమత్తంగా ఉండేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లల్లో ఆక్సిమీటర్ కూడా ఉంటున్నది. కరోనా తీవ్ర రూపం దాలుస్తుండటంతో ప్రజలు ఆక్సిమీటర్లను కొనుగోలుచేస్తున్నారు. వీటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో మెడికల్ షాపు నిర్వాహకులు వీటిని అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతేడాది కరోనా రాకముందు మార్కెట్లో దీని ధర కంపెనీని బట్టి రూ.900లనుంచి ప్రారంభమయ్యేది. ప్రస్తుతం వైరస్ తీవ్రమైన నేపథ్యంలో రూ.1,600- రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదిస్తే తాము తాజా రిటైల్ మార్కెట్లకు సరఫరాచేస్తున్న ధర రూ.1,300- రూ.1,600 దాకా ఉంటున్నదని, రిటైల్‌లో మాత్రం రూ.2,500 వరకు విక్రయిస్తున్నామని ఓ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ఆక్సిమీటర్లు మార్కెట్లో సరిపడా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్‌లో చాలా వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైన భయాందోళన నెలకొన్నది. ఇంట్లో థర్మామీటర్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లతోపాటు పల్స్ ఆక్సిమీటర్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ మార్కెట్ వ్యాపారులు ఆక్సిమీటర్ల కొరత ఉందంటూ వాటి ధరలను పెంచి విక్రయిస్తున్నారు. మెడికల్ షాపునకు వెళ్లి అడిగిన వెంటనే ఇవ్వకుండా.. ప్రస్తుతం స్టాక్ లేదని, కావాలంటే త్వరగా తెప్పించి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని, ధర మాత్రం ఎక్కువగా ఉన్నదని సమాధానం ఇస్తున్నారు.
ఆక్సిమీటర్ పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి
- రీడింగ్ తీసుకొనే సమయంలో ఊపిరి ఎక్కువగా తీసుకుంటే సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని అంటున్నారు.
- చేతులు చల్లగా ఉన్నప్పుడు రీడింగ్ తీసుకోకూడదు.
- నీలం, నలుపు వంటి ముదురు నెయిల్ పాలిష్‌లు వేసుకున్న వేలుకు పల్స్ ఆక్సిమీటర్ పెట్టకూడదు.
- ఒక చేతి వేలుకు పెట్టి చూడకుండా రెండో చేతికి కూడా పెట్టి చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
- వేలుపై బుడిపెలు ఉన్నా, గోరింటాకు పెట్టుకొని ఉన్నా రీడింగ్ సరిగా చూపించదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

