OnePlus 12R | సన్సెట్ డ్యూన్ కలర్ ఆప్షన్లో వన్ ప్లస్ 12 ఆర్.. ధరెంతంటే..?!
OnePlus 12R | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన వన్ ప్లస్ 12 ఆర్ (OnePlus 12 R) ఫోన్ శుక్రవారం కొత్త కలర్ ఆప్షన్ - సన్ సెట్ డ్యూన్ ఆప్షన్లో ఆవిష్కరించింది.
OnePlus 12R | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన వన్ ప్లస్ 12 ఆర్ (OnePlus 12 R) ఫోన్ శుక్రవారం కొత్త కలర్ ఆప్షన్ – సన్ సెట్ డ్యూన్ ఆప్షన్లో ఆవిష్కరించింది. పలు ఆఫర్లతో సింగిల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తోందీ ఫోన్. నో కాస్ట్ ఈఎంఐతోపాటు ఈ ఫోన్ కొనుగోలు దారులకు ఉచితంగా వన్ ప్లస్ బడ్స్3 అంద జేయనున్నది. ఈ నెల 20 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ నెలలో వన్ ప్లస్ మార్కెట్లోకి తెస్తున్న తొలి ఫోన్ వన్ ప్లస్ 12 ఆర్ కాగా, ఈ నెల 16న వన్ ప్లస్ నార్డ్ 4 ఆవిష్కరించనున్నది.
వన్ ప్లస్ 12 ఆర్ సన్ సెట్ డ్యూన్ కలర్ ఆప్షన్ లో వస్తున్న ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.42,999 పలుకుతుంది. ఇంతకుముందు గత మార్చిలోనే రెండు కలర్ ఆప్షన్లు – కూల్ బ్లూ, ఐరన్ గ్రే రంగుల్లో భారత్ మార్కెట్లోకి ఎంటరైందీ ఫోన్. ఐసీఐసీఐ బ్యాంకు, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులపై, ఈఎంఐ లావాదేవీలపై రూ.3000 వరకూ బ్యాంకు డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. తొమ్మిది నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ వర్తిస్తుంది.
వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1264×2780 పిక్సెల్స్ రిజొల్యూసన్, 6.78 అంగుళాల ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ వేరియంట్ గా అందుబాటులో ఉంటుంది. ఫోన్ థర్మల్ ఎఫిషియెన్సీని కాపాడేందుకు కైరో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది.
వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ 50 మెగా పిక్సెల్స్ సెన్సర్ సోనీ ఐఎంఎక్స్ 890 మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇంకా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 100 వాట్ల సూపర్ వూక్ వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

