OnePlus 12 | గ్లోబల్ మార్కెట్లో వన్ ప్లస్ 12 ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఇదే.. ఇవీ స్పెషిఫికేషన్స్
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) త్వరలో తన వన్‌ప్లస్ 12 (OnePlus 12) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చేనెలలో వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్లు భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటరవుతాయని తెలుస్తున్నది.
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) త్వరలో తన వన్‌ప్లస్ 12 (OnePlus 12) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చేనెలలో వన్‌ప్లస్ 12, భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటరవుతుందని తెలుస్తున్నది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ (Qualcomm Snapdragon 8 Gen 3 chip) తో వస్తున్నది. సోనీ ఎల్వైటీ- 808 సెన్సర్‌తోపాటు హస్సెల్‌బ్లాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంతోపాటు వన్ ప్లస్ 12 ఆర్ (OnePlus 12 R) ఫోన్ కూడా వస్తుంది. ఈ ఫోన్లు యూరప్, గ్లోబల్ మార్కెట్లలో వచ్చేనెల 23న వన్‌ప్లస్ ఆవిష్కరించనున్నది. వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్ కంటే వన్ ప్లస్ 12 ఫోన్ ధర తక్కువగా ఉండొచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుతం వన్‌ప్లస్ 12 ఫోన్ చైనా మార్కెట్లో లభిస్తున్నది. క్వాల్ కామ్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్, 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 6.82-అంగుళాల ఎల్టీపీఓ ఓలెడ్ స్క్రీన్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ సోనీ ఎల్వైటీ-808 సెన్సర్ ప్రైమరీ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 64-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 48-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 100వాట్ల సూపర్ వూక్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

