Moto G64 5G | మోటరోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ మోటో జీ64 5జీ.. ధరెంతో తెలుసా..?!
Moto G64 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ64 5జీ (Moto G64 5G) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Moto G64 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ64 5జీ (Moto G64 5G) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 2022లో ఆవిస్కరించిన మోటో జీ62 ఫోన్ కొనసాగింపుగా మోటో జీ64 5జీ ఫోన్ తీసుకొచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 (MediaTek Dimensity 7025 chipset) చిప్ సెట్ తో భారత్ మార్కెట్లోకి వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 33వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ వర్షన్ అప్ డేట్ ఒకసారి అందిస్తామని హామీ ఇచ్చింది మోటరోలా.
మోటో జీ64 5జీ (Moto G64 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999లకే లభ్యం అవుతుంది. ఐస్ లిలాక్, మింట్ గ్రీన్, పెరల్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. మోటరోలా వెబ్ సైట్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు దేశంలోని రిటైల్ స్టోర్లన్నింటిలో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఈఎంఐ లావాదేవీలతో కొనుగోలు చేస్తే రూ.1100 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మోటో జీ64 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ ఓఎస్ పై పని చేస్తుంది. మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్ తోపాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్ ఒకసారి అందిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉంటది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్ సెట్ తో వస్తున్నది.
మోటో జీ64 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (పీడీఏఎఫ్)తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తున్న మోటో జీ64 5జీ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ పెంచుకోవచ్చు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

