Moto g64 5G | 16న భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ మోటో జీ64 5జీ ఫోన్ లాంచింగ్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Moto g64 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా న్యూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘మోటో జీ64 5జీ’ ఫోన్‌ను ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Moto g64 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా న్యూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘మోటో జీ64 5జీ’ ఫోన్‌ను ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ తో వస్తున్నది. ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్లు, రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించే ఈ ఫోన్ ధర రూ.20 వేలు ఉంటుందని భావిస్తున్నారు.
మోటో జీ64 5జీ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ (2400×1080 పిక్సెల్స్) రిజొల్యూషన్ తో వస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఆధారిత 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది.
మోటో జీ64 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్స్ వరకూ స్టోరేజీ పెంచుకోవచ్చు. 2.5 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ సీపీయూతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ 15, సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 30వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

