పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ ఆఫర్
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తమ పాలసీదారులకు శుక్రవారం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఆగిపోయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. 2 నెలలపాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనున్నది.
న్యూఢిల్లీ, జనవరి 2 : ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తమ పాలసీదారులకు శుక్రవారం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఆగిపోయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. 2 నెలలపాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనున్నది. మార్చి 2దాకా అన్ని నాన్-లింక్డ్ లాప్స్డ్ పాలసీలకు ఆలస్య రుసుములో ఆకర్షణీయ రాయితీతో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
సదరు బీమా ప్లాన్లకు అర్హత ఉంటే లేట్ ఫీజులో గరిష్ఠంగా రూ.5వేలు లేదా 30 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని ఓ ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది. కాగా, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఆలస్య రుసుమును సంస్థ పూర్తిగా ఎత్తేసింది. అయితే మెడికల్/ఆరోగ్య అవసరాలపై మాత్రం ఎలాంటి రాయితీలు ఉండవని ఎల్ఐసీ స్పష్టం చేసింది. పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఈ సదవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలన్నది. ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రీమియంలు సకాలంలో చెల్లించలేక ఆగిపోయిన పాలసీలకు చక్కని అవకాశంగా ఎల్ఐసీ ఈ సందర్భంగా పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

