LIC Co branded Credit Card | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. మాస్టర్ కార్డ్‌తో కలిసి ఎల్ఐసీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు.. ఇవీ డిటైల్స్..!
LIC Co branded Credit Card | అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ ‘మాస్టర్ కార్డ్’, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో కలిసి తాజాగా మరో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఆవిష్కరిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.
LIC Co branded Credit Card | గతంతో పోలిస్తే భారతీయుల్లో క్రెడిట్ కార్డు వాడకం పెరిగిపోయింది. బ్యాంకులతోపాటు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, ఈ-కామర్స్ జెయింట్స్ సైతం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఆ బాటలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కూడా జత కలిసింది. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ ‘మాస్టర్ కార్డ్ (Master Card), ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank)తో కలిసి తాజాగా మరో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఆవిష్కరిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. ఎల్ఐసీ అనుబంధ సంస్థ ఎల్ఐసీ కార్డ్స్ సారధ్యంలో ఈ క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డు ‘ఎల్ఐసీ క్లాసిక్’, ‘ఎల్ఐసీ సెలెక్ట్’ పేరుతో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డులతో దేశంలోని 27 కోట్ల మందికి పైగా బీమా పాలసీదారులు తమ బీమా ప్రీమియం చెల్లింపులపై రివార్డు పాయింట్లు పొందొచ్చునని ఎల్ఐసీ కార్డ్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
కార్డ్ కోల్పోయిన వారికి రూ.50 వేల, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ రూ.5 లక్షలతోపాటు పలు ఇతర బెనిఫిట్లు లభిస్తాయి. ‘గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారితోపాటు ఎల్ఐసీ పాలసీదారులకు ఈ అదనపు బెనిఫిట్లు పొడిగిస్తాం’ అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ వీ వైద్యనాథన్ తెలిపారు.
ఎల్ఐసీ చైర్మన్- ఎల్ఐసీ కార్డ్స్ చైర్మన్ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ ‘మా విలువైన కస్టమర్లకు బెస్ట్ సర్వీసులు అందించడానికి మా భాగస్వామ్యం కట్టుబడి ఉంటుంది. కస్టమర్ కేంద్రంగా సేవలందించేందుకు నూతన తరం బ్యాంక్‌గా ఐడీఎఫ్సీ బ్యాంక్తోనూ, ఎల్ఐసీతోనూ భాగస్వామ్యం వల్ల మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది’ అని తెలిపారు. సురక్షిత జీవితం కోసం డిజిటల్ టూల్‌గా మా క్రెడిట్ కార్డు దోహద పడుతుందన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమాతోపాటు పలు రక్షణాత్మక కవరేజీలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల లాంజీల్లోకి అనుమతి, పలు ట్రావెల్ బెనిఫిట్లు అందిస్తుందీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

