Lenovo Tab M11 | లెనోవో కొత్త టాబ్లెట్ లెనోవో టాబ్ ఎం11.. ఇవీ ఫీచర్లు..!
Lenovo Tab M11 | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ లెనోవో అత్యాధునిక ఫీచర్లతో తన సరికొత్త టాబ్లెట్ లెనోవో టాబ్ ఎం11 ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది.
Lenovo Tab M11 | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ లెనోవో (Lenovo) అత్యాధునిక ఫీచర్లతో తన సరికొత్త టాబ్లెట్ లెనోవో టాబ్ ఎం11 (Lenovo Tab M11) ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది. గత జనవరిలో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో తొలుత ఈ టాబ్లెట్ ను ప్రదర్శించింది లెనోవో. మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ (Media Tek Helio G88 SoC) ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ, 15 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 7040 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది.
రెండు కనెక్టివిటీ వేరియంట్లలో లభ్యం అవుతున్నది లెనోవో టాబ్ ఎం11. వై-ఫై ఆప్షన్ మాత్రమే గల లెనోవో ఎం11 రూ.17.999 , ఎల్టీఈ వేరియంట్ విత్ లెనోవో టాబ్ పెన్ వేరియంట్ రూ.21,999 పలుకుతుంది. లెనోవో ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తారు. ఈ నెల 26 నుంచి అమెజాన్ లోనూ బుక్ చేసుకోవచ్చు.

లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 11-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ (1920×1200 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. హెచ్డీ క్వాలిటీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కోసం టీయూవీ రైన్ లాండ్ సర్టిఫికేషన్ ఇస్తారు. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ యూఐ వర్షన్ పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఓఎస్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. డాల్బీ ఆట్మోస్ ఆడియో మద్దతుతో క్వాడ్ స్పీకర్లు ఉంటాయి. లెనోవో టాబ్ పెన్‌తో పోలిస్తే లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్ సౌకర్యవంతంగా ఉంటుంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ తోపాటు రాయడానికి, డ్రాయింగ్ కోసం డిజిటల్ పెన్స్ ఉంటాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తోపాటు వై-ఫై, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
స్టైలస్ ఇన్ పుట్ సదుపాయంతో వస్తున్న ఈ టాబ్లెట్‌లో ‘నెబో’ యాప్ ఇన్ బిల్ట్ గా ఇవ్వడంతో నోట్స్ రాసుకోవచ్చు. యూజర్ల చేతి రాతను కూడా టెక్ట్స్ గా మార్చేస్తుంది. కఠినమైన మ్యాథ్స్ ఈక్వేషన్ల పరిష్కారానికి మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటది. ఇక డాక్యుమెంట్ల మేనేజ్మెంట్ కోసం డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్ ఉంటుంది. లెనోవో ఫ్రీ స్టయిల్ యాప్ సాయంతో టాబ్లెట్‌ను ఒక పర్సనల్ కంప్యూటర్‌కి గాని, మరొక ట్యాబ్లెట్‌కు గాని అనుసంధానించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

