First Republic Bank | ఒక్కటైన అమెరికా బ్యాంకులు.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ.. !
First Republic Bank | 2008 నాటి లేమాన్ బ్రదర్స్ స్థాయి సంక్షోభాన్ని నివారించేందుకు 11 అగ్రశ్రేణి అమెరికన్ బ్యాంకులు సిద్ధం అయ్యాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి.
First Republic Bank | సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్‌ల పతనం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నదని తెలుస్తున్నది. మరికొన్ని బ్యాంకులు కూడా పతనావస్థకు చేరువలో ఉన్నాయన్న వార్తలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈయూ పరిధిలో క్రెడిట్ సూయిజ్ కూడా దివాళ పరిస్థితిలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. మరో దఫా 2008 లేమాన్ బ్రదర్స్ స్థాయి సంక్షోభం రావచ్చుననే అనుమానాలు తలెత్తున్నాయి. ఈ తరుణంలో 11 అమెరికా బడా బ్యాంకులు ఒక్కతాటిపైకి వచ్చి.. మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడిగా చర్యలకు ఉపక్రమించాయి. పతనావస్థకు చేరువలో ఉన్న ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంకును ఆదుకోవడానికి 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించాయి.
సిలీకాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ)లో మాదిరిగానే ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంకులోనూ టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్ సంస్థల డిపాజిట్లే అధికం. 2022 డిసెంబర్ నెలాకరు నాటికి ఫస్ట్ రిపబ్లికన్ పార్టీలో 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై వదంతులు, పుకార్ల నేపథ్యంలో డిపాజిటర్లు ఇటీవల భారీగా నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ద్రవ్య లభ్యత సమస్య తలెత్తి దివాళా తీయొచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అందుకే అమెరికన్ బ్యాంకులన్నీ కలిసి ఉమ్మడిగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకునేందుకు ముందుకొచ్చాయి.
ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు నిధులు సమకూరుస్తున్న బ్యాంకుల్లో జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్ఘో, మోర్గాన్ స్లాన్లీ, గోల్డ్‌మాన్ సాచెస్, బీఎన్వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్సీ బ్యాంక్, ట్రూయిస్ట్, యూఎస్ బ్యాంకు ఉన్నాయి. తామంతా ఒకే వేదికపైకి రావడం.. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టమో తెలుపుతుందని ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. 2008 ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు కూడా అమెరికా బ్యాంకులు ఏకతాటిపై ముందుకు వచ్చి బలహీన బ్యాంకులను ఆదుకునేందుకు రెడీ అయ్యాయి. కొన్ని బడా బ్యాంకులు, ఇతర బ్యాంకుల్ని టేకోవర్ చేసి, సంక్షోభం ముదరకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి అప్పటికే విషమించింది. ఫలితంగా 2008 నాటి ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తాకిందని చెబుతున్నారు.
ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు ఖాతాదారుల్లో పలువురు కుబేరులున్నారని వినికిడి. వీరికి చాలా సులభమైన షరతులతో బ్యాంకింగ్ లావాదేవీల సేవలందిస్తున్నది. ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో లోన్ తీసుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తాకథనం వెలువరించింది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 36 శాతం నష్టపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు.. 11 అమెరికా బ్యాంకుల 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటనతో తిరిగి లాభాల్లోకి వచ్చింది. చివరకు 10 శాతం లాభంతో ఫస్ట్ రిపబ్లిక్ షేర్ స్థిర పడింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు దన్నుగా నిలబడేందుకు 11 బ్యాంకులు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఆర్థికశాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ స్వాగతించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

