JioFiber | హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల కోసం జియో ఫైబర్ సంచలనం.. రూ.1200 నుంచి ప్లాన్లు రెడీ.. !
Jio Fiber | రిలయన్స్ జియో అనుబంధ జియో ఫైబర్.. బ్రాడ్ బాండ్ సేవల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇంటర్నెట్ యూజర్ల కోసం రూ.1197లతో మూడు నెలల ప్రీ-పెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది.
JioFiber | టెలికం సంచలనం రిలయన్స్ జియో.. యూజర్లకు సేవలందించడంతో దూకుడుగా వ్యవహరిస్తున్నది. 4జీ సేవలతో టెలికం సంస్థలను దాటేసిన రిలయన్స్ జియో.. అనుబంధ సంస్థ జియో ఫైబర్ తాజాగా బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల విషయంలోనూ అంతే స్పీడ్‌గా దూసుకెళ్తున్నది. చౌకధరకే ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్ బ్రాడ్ ప్లాన్లు తీసుకొస్తున్నది. నెలవారీగా రూ.399లతో మొదలైన ప్లాన్.. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందాలని కోరుకునే వారు ఏడాది ప్లాన్ కింద రూ.లక్షకు పైగా పే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు మూడు నెలల ప్రీ-పెయిడ్ ప్లాన్ రూ.1197లకే అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ సేవలను మాత్రమే ఉపయోగించుకునే యూజర్లకు రూ.1197లతో కూడిన ప్రీ-పెయిడ్ ప్లాన్ సరిపోతుంది. ఈ ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. ప్రతి నెలా 3.3 టిగా బైట్ల వరకు అపరిమిత డేటాతోపాటు కాలింగ్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ఓటీటీ బెనిఫిట్లు లభించవు.
రూ.399 నుంచి జియో ఫైబర్ ప్లాన్లు మొదలవుతాయి. బేసిక్ ప్లాన్లతో లభించే సదుపాయాలు మూడు నెలల ప్లాన్‌లోనూ లభిస్తాయి. ప్రతి నెలా రీచార్జి చేసుకోవడానికి బదులు ఒకేసారి రీచార్జి చేసుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటది.
టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షించాలనుకునే వారు ఎక్కువ మొత్తం టారిఫ్ పే చేసి ఇతర ప్లాన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. రూ.1197 ప్లాన్ మాదిరిగా 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు పొందడానికి నెలకు రూ.699, మూడు నెలలకు రూ.2097, నెలకు 150 ఎంబీపీఎస్ ప్లాన్ మీద రూ.999, మూడు నెలలకు రూ.2997, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు రూ.1499 ప్లాన్ మూడు నెలలకు రూ.4497లతో అందుబాటులోకి తెచ్చింది జియో ఫైబర్.
రూ.2997 ప్లాన్ కింద 150 ఎంబీపీఎస్ స్పీడ్ తోపాటు అపరిమిత కాలింగ్, డేటా బెనిఫిట్లు పొందొచ్చు. ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్, జియో సినిమాతోపాటు 16 స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో కూడిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షించవచ్చు. ఇక రూ.4497 ప్లాన్ కింద 300 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్, జియో సినిమా సహా 17 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సేవలు వీక్షించవచ్చు.
రూ.7497 ప్లాన్ ఎంచుకునే వారు 500 ఎంబీపీఎస్, రూ.11997, రూ.25,497 ప్లాన్లు ఎంచుకునేవారు ఒక జీబీపీఎస్ వేగంతో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. దాదాపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అన్నీ వీక్షించవచ్చు. ప్రతి రోజూ మరింత డేటా వాడుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

