Jawa Yezdi | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ జావా యెజ్డీ.. బాబర్ సెగ్మెంట్లో కుర్రాళ్లను ఆకట్టుకునే న్యూ జావా 44 బాబర్ బ్లాక్ మిర్రర్ బైక్ మార్కెట్లో ఆవిష్కరించింది. జావా 42 బాబర్ బ్లాక్ మిర్రర్ ధర రూ.2,25,187 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ప్రీమియం డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో రూపుదిద్దుకున్న బైక్ ఎటువంటి రోడ్లపైనైనా దూసుకెళ్లవచ్చు.
334సీసీ, లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ మోటార్‌తో వస్తున్న బైక్ గరిష్టంగా 29.9 పీఎస్ విద్యుత్, 32.7 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో పని చేస్తుంది. జస్పర్ రెడ్ డ్యుయల్ టోన్, మూన్ స్టోన్ వైట్, మైస్టిక్ కాపర్, బ్లాక్ మిర్రర్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది జావా 42 బాబర్ బ్లాక్ మిర్రర్ బైక్. స్లిప్పర్ క్లచ్, ఫోన్ల చార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్, అడ్జస్టబుల్ సీట్, డిజిటల్ కన్సోల్, ఫ్యూయల్ కెపాసిటీ, ఆర్పీఎం, గేర్ పొజిషనింగ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.