Bit Coin | క్రిప్టోల అమ్మకాల ఒత్తిడి.. భారీగా బిట్ కాయిన్ పతనం
Bit Coin | 4 రోజుల్లో క్రిప్టో కరెన్సీ టోకెన్లు 25 శాతం నష్టపోయాయి. బిట్ కాయిన్ ఎం-క్యాప్ లక్ష కోట్ల డాలర్లు పతనమైంది.

Bit Coin | క్రిప్టో కరెన్సీల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నాలుగు సెషన్లలోనే ప్రధాన క్రిప్టో టోకెన్లు సుమారు 25 శాతం నష్టపోయాయి. గత ఏడు సెషన్లలో అత్యధిక టోకెన్లు డబుల్ డిజిట్స్ కట్ అయ్యాయి. క్రిప్టో కరెన్సీలను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటామని రష్యా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం బిట్ కాయిన్ ఏడు శాతం నష్టపోయింది. ఐదు నెలల కనిష్టానికి పడిపోయి 38,261 డాలర్లకు చేరుకున్నది. గత నవంబర్లో ఆల్టైం రికార్డు నెలకొల్పిన బిట్ కాయిన్.. మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్ల వరకు పడిపోయింది.
క్రిప్టో కరెన్సీలతో దేశ ఆర్థిక సుస్థిరతకు ముప్పు అని, పౌరుల బాగోగులు దెబ్బ తింటాయి. ద్రవ్య పరపతి సార్వభౌమత్వానికి ముప్పని ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రష్యా తన భూభాగంపై క్రిప్టో కరెన్సీ మైనింగ్, వాడకంపై నిషేధం విధించాలని ప్రతిపాదించినట్లు గురువారం రష్యా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు అమెరికా వడ్డీరేట్లు పెంచనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు మళ్లుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bit coin
- Cryptocurrency
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

