iQoo Neo 9 Pro | వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి ఐక్యూ నియో 9 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్…!
iQoo Neo 9 Pro | షియోమీ సబ్ బ్రాండ్ ఐక్యూ తన ఐక్యూ నియో 9 ప్రో ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
iQoo Neo 9 Pro | షియోమీ సబ్ బ్రాండ్ ఐక్యూ తన ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్సెట్ తో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదల చేసిన ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్ సెట్ కలిగి ఉంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్’ ద్వారా విక్రయిస్తామని ఐక్యూ ధ్రువీకరించింది. ఈ ఫోన్ ధర రూ.40 వేల లోపు ఉండొచ్చునని భావిస్తున్నారు.
గతేడాది డిసెంబర్లో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.35,100 (2999 చైనా యువాన్లు) పలుకుతున్నది. వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి రానున్నదీ ఫోన్. ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ చైనాలో ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 16 జీబీ ర్యామ్, ఒక టిగా బైట్ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది.
50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్920 ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై7, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

