iPhone 13 | రూ.40 వేలలోపే ఐ-ఫోన్ 13.. ఇతర ఐ-ఫోన్లపై ఇలా డిస్కౌంట్లు.. !
iPhone 13 | ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈ నెల ఎనిమిదో ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఐఫోన్ 13 ఫోన్.. రూ.40 వేలలోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 13 | మీరు ఆపిల్ ఐ-ఫోన్ కొనుక్కోవాలని భావిస్తున్నారా.. అయితే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తోంది. ఐ-ఫోన్ 13 ఫోన్‌పై భారీ రాయితీ లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2023లో భాగంగా ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.40 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. ఇందులోనే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా ఐ-ఫోన్ 13 ఫోన్ తోపాటు పలు ఫోన్లపై ఆకర్షణీయ డీల్స్ ప్రకటించింది అమెజాన్. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభం అవుతాయి.
2021లో మార్కెట్లో ఆవిష్కరించిన 128 జీబీ స్టోరేజీ ఐ-ఫోన్ 13 ఫోన్ అసలు ధర 59,900, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ ధర రూ.69,900, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,900 పలుకుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు రూ.20 వేలు డిస్కౌంట్ అందిస్తోంది.
ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ తో ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.40 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుంది. ఐ-ఫోన్ 13తోపాటు ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 14 ప్లస్, ఐ-ఫోన్ 14 ప్రో ఫోన్లపైనా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది అమెజాన్.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా డిస్కౌంట్లు
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో ఐ-ఫోన్ 12, ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐ-ఫోన్ 12 ఫోన్ రూ.38,999 కాగా, సెలెక్టెడ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై రూ.3000, అదనంగా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.3000 లభిస్తుంది. దీంతో ఐ-ఫోన్ 12 ఫోన్ రూ.38,999 నుంచి రూ.32,999లకు లభిస్తుంది. ఐఫోన్ 14 ఫోన్ రూ.50 వేల లోపు, ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్లు రూ.60వేల లోపు ధరలకే లభిస్తాయి. ఐ-ఫోన్ 14 ఫోన్ అసలు ధర రూ.69,900, ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ రూ.79,900లకు లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

