వడ్డీరేట్లు మారాయ్
బ్యాంకులు వాటి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారంగా రుణ వడ్డీరేట్లను నిర్ణయిస్తుంటాయి. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలను ప్రభావితం చేసే ఎంసీఎల్ఆర్ను ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బీవోబీ తదితర కొన్ని బ్యాంకులు ఈ నెలలో సవరించాయి. ఆ వివరాలివే..
- జనవరి నుంచే అమల్లోకి
బ్యాంకులు వాటి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారంగా రుణ వడ్డీరేట్లను నిర్ణయిస్తుంటాయి. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలను ప్రభావితం చేసే ఎంసీఎల్ఆర్ను ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బీవోబీ తదితర కొన్ని బ్యాంకులు ఈ నెలలో సవరించాయి. ఆ వివరాలివే..
ఐసీఐసీఐ బ్యాంక్: 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్, ఒక నెల, 6 నెలల రేట్లు 8.6 శాతానికి, 3 నెలలది 8.65 శాతానికి, ఏడాది రేటు 8.7 శాతానికి పెరిగాయి.
బీవోఐ : ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్టు బ్యాంక్ ఆఫ్ ఇండి యా (బీవోఐ) వెబ్సైట్ వెల్లడిస్తున్నది. ఓవర్‌నైట్ రేటు 8 శాతానికి చేరగా, ఒక నెల రేటు 8.25 శాతం, 6 నెలల రేటు 8.6 శాతం, ఏడాది రేటు 8.8 శాతంగా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8 శాతం నుంచి 8.05 శాతానికి పెరగ్గా, కొన్ని కాల పరిమితులకు మార్పులేవీ చేయలేదు. ఒక నెలది 8.3 శాతం, 3 నెలలది 8.4 శాతంగా ఉన్నాయి.6 నెలలది 8.6 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 8.8 శాతానికి పెరిగింది.
కెనరా బ్యాంక్: 5 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.05 శాతానికి, నెలది 8.15 శాతానికి, 3 నెలలది 8.25 శాతానికి, 6 నెలలది 8.6 శాతానికి, ఏడాదిది 8.8 శాతానికి, రెండేం డ్లది 9.1 శాతానికి, మూడేండ్లది 9.2 శాతానికి పెరిగాయి. రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 9.25 శాతం.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: తాజా ఎంసీఎల్ఆర్ 8.8 శాతం-9.3 శాతం శ్రేణిలో ఉన్నది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.8 శాతానికి చేరింది. నెల రోజులది 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 8.8 శాతానికి, మూడు నెలలది 8.95 శాతానికి, 6 నెలలది 9.2 శాతానికి పెరిగాయి. పలు వినియోగ రుణాలకు అనుసంధానించే ఏడాది ఎంసీఎల్ఆర్ 9.25 శాతానికి చేరింది.
ఐడీబీఐ బ్యాంక్: ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.3 శాతంగా, నెల రేటు 8.45 శాతంగా ఉన్నాయి. 3 నెలలది 8.75 శాతం, 6 నెలలది 8.95 శాతం, ఏడాది రేటు 9 శాతంగా ఉన్నాయి. రెండేండ్లది 9.55 శాతం, మూడేండ్లది 9.95 శాతం.
యెస్ బ్యాంక్: ఈ బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు ఎంసీఎల్ఆర్ ఓవర్‌నైట్ రేటు 9.2 శాతంగా ఉన్నది. అలాగే ఒక నెల రేటు 9.45 శాతం, 3 నెలల రేటు 10 శాతం, 6 నెలల రేటు 10.25 శాతం, ఒక ఏడాది రేటు 10.50 శాతంగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

