Infinix GT 10 Pro | ఇన్ఫినిక్స్ నుంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ధరెంతంటే..?!
Infinix GT 10 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన జీటీ సిరీస్ ఫోన్ జీటీ10 ప్రో ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999 గా నిర్ణయించారు.
Infinix GT 10 Pro | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్లోకి తన జీటీ సిరీస్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ గురువారం ఆవిష్కరించింది. పూర్తిగా గేమింగ్ కోసం డెడికేట్ చేసిన ఫోన్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ (MediaTek Dimensity 8050 SoC) చిప్సెట్తో వస్తున్నది. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ అమోలెడ్ స్క్రీన్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది.
ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ రెండు కలర్స్ వేరియంట్ – సైబర్ బ్లాక్, మిరేజ్ సిల్వర్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా గురువారం సేల్స్ ప్రారంభం అయ్యాయి. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.19,999 పలుకుతుంది. ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,334 నుంచి ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. తొలి 5,000 మంది కొనుగోలు దారులకు అదనపు గేమింగ్ విడి భాగాలు అందజేస్తుంది.
ఇన్ ఫినిక్స్ జీటీ 10 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. ఆండ్రాయిడ్ -14 వర్షన్‌తోపాటు రెండేండ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ + 1 బిట్ అమోలెడ్ ఎల్టీపీఎస్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్నది.
108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, రెండు 2-మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. డీటీఎస్ ఆడియా టెక్నాలజీ అండ్ హెచ్ఐ-రెస్ ఆడియో సర్టిఫికేషన్ సామర్థ్యంతో స్టీరియో డ్యుయల్ స్పీకర్లు, అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింటర్ సెన్సర్, లైట్ సెన్సర్, ఈ-కంపాస్, జీ-సెన్సర్, గైరోస్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సార్ తదితర ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

