Infinix GT 10 Pro | గేమింగ్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో ధర పెంపు.. ఎంతంటే..?!
Infinix GT 10 Pro | గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో ఫోన్ ధర పెరిగింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.20,999లకు లభిస్తుంది.
Infinix GT 10 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ ధర పెంచేశారు. ఆన్లైన్ గేమ్స్ కోసం డిజైన్ చేసిన ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో ఫోన్ సవరించిన ధర ఫ్లిప్ కార్ట్‌లో లిస్ట్ చేశారు. గత నెలలో ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో.. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 108-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది.
సవరించిన ధర ప్రకారం ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో ఫోన్ రూ.20,999లకు అందుబాటులో ఉంది. గత నెల మొదటి వారంలో ఆవిష్కరించినప్పుడు ఫోన్ ధర రూ.19,999గా ఉంది. సైబర్ బ్లాక్, మిరేజ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, ధర పెంచడానికి కారణాలు ఇన్ఫినిక్స్ వెల్లడించలేదు.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్‌పై ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రో ఫోన్ పని చేస్తుంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ ఎల్టీపీఎస్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. 8జీబీ రామ్‌తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో వర్చువల్‌గా 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డీటీఎస్ ఆడియో టెక్నాలజీతో రూపుదిద్దుకున్న స్టీరియో డ్యూయల్ స్పీకర్లు ఉంటాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

