ముంబై, మే 20: విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల 13తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.676 బిలియన్ డాలర్లు తగ్గి 593.279 బిలయన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతక్రితం వారంలోనూ ఫారెక్స్ రిజర్వులు 1.774 బిలియన్ డాలర్లు తగ్గి 595.954 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశీ కరెన్సీ రూపంలోవున్న ఆస్తుల విలువ కరిగిపోవడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. మొత్తం రిజర్వులు, పసిడి రిజర్వులు కూడా 1.169 బిలియన్ డాలర్లు తగ్గి 40.57 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.