కరిగిపోతున్న విదేశీ నిల్వలు.. మరో రూ.లక్ష కోట్లు డౌన్
విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోవడంతోపాటు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో ఫారెక్స్ రిజర్వుల భారీగా పడిపోతున్నాయి.
ముంబై, ఏప్రిల్ 3 : విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోవడంతోపాటు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో ఫారెక్స్ రిజర్వుల భారీగా పడిపోతున్నాయి. మార్చి నెల చివరివారంలో ఫార్సె రిజర్వులు 10.288 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.లక్ష కోట్లు) తరిగిపోయి 688.058 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 11.414 బిలియన్ డాలర్లు పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా వరుసగా రెండు వారాల్లో రిజర్వులు 22 బిలియన్ డాలర్లు పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రికార్డు స్థాయి 728.494 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఫారెక్స్ రిజర్వులు గడిచిన నెల రోజుల్లోనే 30 బిలియన్ డాలర్ల స్థాయిలో పతనం చెందాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రూపాయి కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది.
మార్చి 27తో ముగిసిన వారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 6.622 బిలియన్ డాలర్లు తగ్గి 551.072 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. డాలరేతర కరెన్సీలు అయిన యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురికావడం వల్లనే విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోయాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే పసిడి రిజర్వులు మరింత తగ్గాయి. 3.666 బిలియన్ డాలర్లు తగ్గి 113.521 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు వెల్లడించింది. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మాత్రం 17 మిలియన్ డాలర్లు ఎగబాకి 18.649 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ వద్ద నిల్వలు 17 మిలియన్ డాలర్లు తగ్గి 4.816 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

