ముంబై, సెప్టెంబర్ 16: విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల9తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 2.234 బిలియన్ డాలర్లు తగ్గి 550.871 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితంవారంలోనూ రిజర్వులు 7.941 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తగ్గడం వల్లనే ఫారెక్స్ రిజర్వులు తరిగిపోతున్నాయని నివేదిక వెల్లడించింది. గతవారంలో ఎఫ్సీఏఎస్ 2.510 బిలియన్ డాలర్లు తగ్గి 489.598 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కానీ, పసిడి రిజర్వులు మాత్రం 340 మిలియన్ డాలర్లు ఎగబాకి 38.644 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.