Indian AI Engineer | డెవిన్ VS దేవిక : భారత ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిష్కరణ
Indian AI Engineer : ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్‌కు దీటుగా భారత్ నుంచి ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ దేవిక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
Indian AI Engineer : ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్‌కు దీటుగా భారత్ నుంచి ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ దేవిక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్‌లోనే తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్‌ను కాగ్నిషన్ అనే అమెరికన్ స్టార్టప్ ఇటీవల డెవలప్ చేయగా భారత్‌కు చెందిన ముఫీద్ వీహెచ్ లిమినల్ అండ్ స్టిషన్.ఏఐ దేవిక పేరుతో ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దేవిక డెవిన్ తరహాలో మెషీన్ లెర్నింగ్, నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ద్వారా మనుషులు ఇచ్చే సూచనలను అర్ధం చేసుకుని అందుకు అనుగుణంగా టాస్క్‌లను చక్కబెడుతుంది.
దేవిక ఆపై తన సొంత పరిశోధనతో వ్యవహరిస్తూ కోడ్స్ రాయడం ఆపై నిర్ధేశించిన లక్ష్య్యాలను చేరుకుంటుంది. అమెరికా అభివృద్ధి చేసిన డెవిన్‌కు దీటుగా డెవలపర్ల సహకారంతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది. దేవిక ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ కావడంతో మరింత పారదర్శకత, టెకీల ప్రమేయంతో ఇతోధిక అభివృద్ధికి వెసులుబాటు ఉంది.
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న దేవికను సాంకేతిక అంశాలను, బగ్‌ను పరిష్కరించిన మీదట అధికారికంగా లాంఛ్ చేస్తామని ముఫీద్ వీహెచ్ వెల్లడించారు. తన ప్రాజెక్ట్‌పై పనిచేసేందుకు టెస్టర్లు, కంట్రిబ్యూటర్లను ఎక్స్ వేదిక ద్వారా ముఫీద్ ఆహ్వానించారు. ఏఐ టూల్ ఫీచర్లను ముఫీద్ వెల్లడించారు. దేవిక ఒల్లామా ద్వారా క్లాడ్ 3, GPT-4, GPT-3.5, and లోకల్ LLMలకు మద్దతిస్తుంది. దేవిక తాను రాసే కోడ్స్‌ను రన్ చేస్తుంది. యూజర్ ప్రమేయం లేకుండానే ఏదైనా లోపాలు ఎదురైతే చక్కదిద్దుతుంది.
Read More :
Miyapur | మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

