Hyundai Tucson | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా నూతన తరం ఎస్యూవీ కారు టక్సన్‌ను ఆవిష్కరించింది. వచ్చేనెల నాలుగో తేదీన దేశీయ మార్కెట్లోకి రానున్నది. మిడ్ సైజ్ ఎస్యూవీ క్యాటగిరీ కారు టక్సన్కు 18 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్, క్యాబిన్లో హైసెట్ సెంటర్ కన్సోల్ డ్రైవర్, కో-డ్రైవర్ సీట్లను విడగొడుతుంది. పార్కింగ్ సెన్సన్ ఇన్ఫర్మేషన్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, బ్లూ లింక్ కనెక్ట్‌తోపాటు 60 రకాల ఫీచర్లు జత కలిశాయి.
సరికొత్తగా పారా మెట్రిక్ జ్యువెల్ డైన్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అమర్చారు. వాటిని ఆఫ్ చేస్తే పూర్తిగా గ్రిల్‌తో కలిసి పోతాయి. బంపర్‌లోనే ప్రధాన హెడ్ ల్యాంప్‌తోపాటు వెనుక విండ్ షీల్డ్, టెయిల్ ల్యాంప్ డిజైన్ తదితర అదనపు హంగులు కల్పించారు. హ్యుండాయ్ టక్సన్ కారులో 2.0 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్/ డీజిల్ ఇంజిన్లు , 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ ఇంజిన్ 154 బీహెచ్పీ, 8-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఇంజిన్ 184 బీహెచ్పీ సామర్థ్యం గల శక్తినిస్తుంది. స్టీరింగ్ వెనుక పూర్తిస్థాయి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇందులో నేవిగేషన్, పార్కింగ్ సెన్సర్ ఇన్ఫర్మేసన్ కూడా ఉంటాయి.