Hyundai Cars: హ్యుండాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు
హ్యుండాయ్ ఇండియా ( Hyundai Cars ) కొన్ని సెలక్ట్ చేసిన మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆగస్ట్ నెలకుగాను ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. హ్యుండాయ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.50 వేల వరకూ తగ్గింపు ఉండటం విశేషం.

న్యూఢిల్లీ: హ్యుండాయ్ ఇండియా ( Hyundai Cars ) కొన్ని సెలక్ట్ చేసిన మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆగస్ట్ నెలకుగాను ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. హ్యుండాయ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.50 వేల వరకూ తగ్గింపు ఉండటం విశేషం. వీటిలో ప్రముఖ మోడల్స్ అయిన సాంత్రో, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 ప్రిమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి. అయితే వెన్యూ, వెర్నా, క్రెటా, టస్కన్, అల్కజార్ వంటి మోడల్స్‌పై ఎలాంటి ఆఫర్లు లేవు. ఈ ఆఫర్లు ఈ నెల 31 వరకూ లేదా షోరూమ్‌లలో స్టాక్స్ ఉన్నంత వరకూ ఉంటాయి. అయితే డీలర్‌ను బట్టి ఈ ఆఫర్లలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.
హ్యాండాయ్ సాంత్రో ఎంట్రీ లెవల్ కారుపై రూ.40 వేల వరకూ డిస్కౌంట్ ఇస్తోంది ఆ సంస్థ. ఈ కారుపై రూ.25 వేల డిస్కౌంట్‌తోపాటు రూ.10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక గ్రాండ్ ఐ10 నియోస్పైనా రూ.40 వేల వరకూ తగ్గింపు ఇస్తోంది. ఇక అత్యధికంగా హ్యుండాయ్ ఆరాపై రూ.50 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ రూ.5 వేలు కలిపి ఉన్నాయి. అటు ఐ20 ప్రిమియం హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ.40 వేల డిస్కౌంట్ ప్రకటించింది హ్యుండాయ్ సంస్థ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

