రికార్డుస్థాయికి ఎగుమతులు
దేశం నుంచి ఎగుమతులు తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి పెరిగాయి. 2021-22లో ఇవి 43.19 శాతం వృద్ధితో 417.81 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం 2020-21లో 291.81 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి.
- 2021-22లో 418 బిలియన్ డాలర్లు
- 192 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశం నుంచి ఎగుమతులు తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి పెరిగాయి. 2021-22లో ఇవి 43.19 శాతం వృద్ధితో 417.81 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం 2020-21లో 291.81 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. ముగిసిన ఏడాది దిగుమతులు సైతం 54.71 శాతం పెరుగుదలతో 394.44 బిలియన్ డాలర్ల నుంచి 610.22 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 192.41 బిలియన్ డాలర్లకు విస్త్రతమయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో ఎగుమతులు తొలిసారిగా 40 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 మార్చి నెలలో జరిగిన 35.26 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే 2022 మార్చిలో 18 శాతం వృద్ధిచెంది 40.38 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇదే నెలలో దిగుమతులు 48.90 బిలియన్ డాలర్ల నుంచి 20.79 శాతం వృద్ధిచెంది 59.07 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 18.69 బిలియన్ డాలర్లుగా ఉంది.
పెట్రోలియంయేతర ఎగుమతులు పూర్తి ఆర్థిక సంవత్సరంలో 32.62 శాతం వృద్ధితో 266 బిలియన్ డాలర్ల నుంచి 352.76 డాలర్లకు పెరిగాయి. మార్చి నెలలో ఇవి 31.65 బిలియన్ డాలర్ల నుంచి 4.28 శాతం పెరిగి 33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెట్రోలియంయేతర దిగుమతులు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా 44.2 శాతం పెరిగాయి. 311.75 బిలియన్ డాలర్ల నుంచి 449.54 డాలర్లకు చేరాయి. మార్చి నెలలో ఇవి 38.63 బిలియన్ డాలర్ల నుంచి 40.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- exports
- Increased exports
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

