హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు.
పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా పరిశీలించి, వివిధ శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత కాలవ్యవధిలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.