Air India | ఎయిర్ఇండియా సహా ఆ మూడు సంస్థలపై సీబీఐ చార్జిషీట్..!
Air India | ఎయిర్ ఇండియా మాజీ ఎండీ అరవింద్ జాదవ్‌తోపాటు ఎస్ఏపీ ఇండియా, ఐబీఎంలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
Air India | ఎయిర్ ఇండియా మాజీ ఎండీ అరవింద్ జాదవ్‌తోపాటు ఎస్ఏపీ ఇండియా, ఐబీఎంలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011లో సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడు రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయడంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన సివిల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ).. ఈ అంశాన్ని సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ.. ఆరేండ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా చార్జీషీట్ దాఖలు చేసింది. ఐపీసీలోని 120, అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని రూల్స్‌కు అనుగుణంగా చార్జీషీట్ నమోదు చేసింది.
సరైన టెండర్ ప్రక్రియ నిర్వహించకుండానే ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ అనే సాఫ్ట్‌వేర్‌ను ఎయిర్ ఇండియా ఎంపిక చేసింది. సంబంధిత పౌర విమానయాన శాఖ అనుమతి కూడా తీసుకోకుండానే సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2009, 2010ల్లో కార్యదర్శులు, మంత్రుల బృందాలకు ఈ విషయమై ప్రెజెంటేషన్ ఇచ్చామని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఇదిలా ఉంటే గతంలో ఒరాకిల్ నుంచి తీసుకున్న ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉండగా, కొత్త సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకున్నారన్న విషయమై క్లారిటీ లేదు. దానిని సరి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు కనిపించడం లేదని సమాచారం. ఓపెన్ టెండర్ ప్రక్రియ చేపట్టకుండానే ఎస్ఏపీ, ఐబీఎంలకు నామినేషన్ పద్దతిలో ఈ కాంట్రాక్టును ఎయిర్ఇండియా అప్పగించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

