న్యూఢిల్లీ : గృహ రుణాల కస్టమర్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాల వ్యవధి పాటు వర్తించే ఆఫర్లో భాగంగా గృహ రుణాలపై 6.65 శాతం వార్షిక వడ్డీరేటును కెనరా బ్యాంక్ శనివారం వెల్లడించింది. రుణ మొత్తంతో నిమిత్తం లేకుండా కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఆకర్షణీయ వడ్డీరేటు, సత్వర మంజూరుతో పాటు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలను కూడా రద్దు చేశామని పేర్కొంది.
పరిమిత కాల ఆఫర్ను వినియోగించుకునే గొప్ప అవకాశం కెనరా బ్యాంక్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిందని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆన్లైన్లోనూ కస్టమర్లు గృహ రుణం కోసం రిక్వెస్ట్ చేయవచ్చని పేర్కొంది. ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఇన్స్టాంట్ అప్రూవల్ పొందవచ్చని ఈ సౌకర్యం కారు, ఎడ్యుకేషన్, గోల్డ్, పర్సనల్ లోన్లకూ అందుబాటులో ఉందని తెలిపింది.