Bugatti | 500 కిలోమీటర్ల స్పీడ్‌తో బుగాట్టి హైపర్ స్పోర్ట్స్ కారు : రూ. 36 కోట్లు పలికే బొలైడ్ ప్రత్యేకతలివే..!
ఫ్రెంచ్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీ బుగాట్టి (Bugatti) తన లేటెస్ట్ వెహికల్ బొలైడ్ డిజైన్ వివరాలను వెల్లడించింది.
పారిస్ : ఫ్రెంచ్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీ బుగాట్టి (Bugatti) తన లేటెస్ట్ వెహికల్ బొలైడ్ డిజైన్ వివరాలను వెల్లడించింది. ఫార్ములా 1 కార్లలో వాడే మెటీరియల్‌నే ఈ స్టన్నింగ్ రేసింగ్ కార్లో వాడతారు. ఈ కారు గంటకు గరిష్టంగా 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ఏడాది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్గా పేరొందిన చిరన్ మోడల్‌కు బొలైడీ ఈవిల్ ట్విన్‌గా చెబుతున్నారు.
ఈ హైపర్ స్పోర్ట్స్ కార్ మల్టీ డైమెన్షల్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 40 ఈ తరహా కార్లను ఒక్కొక్క కారు రూ. 36 కోట్లకు విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024లో బొలైడ్ డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ కారు బరువు 1450 కిలోలు కాగా, కాంపోజిట్ కార్బన్ ఫైబర్ నుంచి దీన్ని తయారుచేశారు.
క్వాడ్రపుల్ టర్బోచార్జడ్ డబ్ల్యూ16 ఇంజన్‌కు ఫిట్ అయ్యేలా కారు బాడీలో ప్రతి ఇంచ్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. బొలైడ్ ఇంటీరియర్‌ను కేవలం ఈ ప్రాజెక్టు కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆప్టిమైజ్డ్ రేసింగ్ సీట్లు, హైటెక్ స్టీరింగ్ వీల్, సేఫ్టీ, కమ్ఫర్ట్, పెర్ఫామెన్స్ దృష్టిలో ఉంచుకుని దీన్ని కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నామని బుగాట్టి తన వెబ్సైట్లో పేర్కొంది.
Read More :
Navdeep Saini | భారత క్రికెట్లో పెండ్లి బాజా.. ప్రేయసిని వివాహం చేసుకున్న సైనీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

