Bank Safety Lockers | ఆర్బీఐ తీపి కబురు.. సేఫ్టీ డిపాజిట్ లాకర్ రూల్స్ చేంజ్!
Bank Safety Lockers | వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ తీపి కబురందించింది. మీ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు.. విలువైన వస్తువులు.. పత్రాలు భద్రత కోసం.....

Bank Safety Lockers |వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ తీపి కబురందించింది. మీ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు.. విలువైన వస్తువులు.. పత్రాలు భద్రత కోసం బ్యాంక్ లాకర్లలో డిపాజిట్ చేశారా.. అయితే, వాటి నిర్వహణ నిబంధనలు మార్చేసింది ఆర్బీఐ. లాకర్లో భద్రపరిచిన బంగారం ఆభరణాలు, ఇతర ముఖ్య పత్రాలు దెబ్బ తిన్నాయా?.. అలా జరిగితే సంబంధిత బ్యాంకు మీకు నష్టపరిహారం చెల్లించాలి.. బ్యాంకులు ఎంత నష్ట పరిహారం ఇవ్వాలి.. లాకర్లలో దాచిపెట్టిన ఆభరణాలు, ఇతర వస్తువులు బ్యాంకుల తప్పిదాల వల్ల దెబ్బ తింటే, వాటిపై మీరు చెల్లించే అద్దె మీద 100 రెట్లు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ బ్యాంకర్దే. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి.
బ్యాంకు లాకర్లు ఉన్న భవనం కూలిపోయినా, అగ్ని ప్రమాదం జరిగినా, దోపిడీ జరిగినా.. బ్యాంకు ఉద్యోగి మోసం చేసినా లాకర్లు అద్దెకు తీసుకున్న వారికి పరిహారం చెల్లించాల్సిందే. ఒకవేళ ఖాతాదారు పొరపాటు ఉంటే ఆ పరిహారం వర్తించదు.
ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం నో
ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న ఆభరణాలు, ముఖ్య పత్రాలకు పరిహారం చెల్లించాలన్న నిబంధన వర్తించదు. భూకంపం లేదా వరద, తుపాన్, పిడుగులు పడినా ఈ నిబంధన వర్తించదు. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి పాత, కొత్త బ్యాంక్ లాకర్ ఖాతాదారులకు మారిన నిబంధనలు అమలు చేయాలని ఆర్బీఐ తెలిపింది.

టర్మ్ డిపాజిట్ ఎందుకంటే..
మీరు కొత్తగా బ్యాంక్ లాకర్ కోసం దరఖాస్తు చేశారా.. అయితే, లభ్యతను బట్టి మీరు వెయిటింగ్లో ఉండాల్సి ఉంటుంది. బ్యాంకర్లు సేఫ్టీ డిపాజిట్ లాకర్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి. మీకు లాకర్ ఉంటే టర్మ్ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో లావాదేవీలు సాగుతున్నప్పుడు కూడా టర్మ్ డిపాజిట్లు చేయాలని బ్యాంకర్లు అడగరు. లాకర్ రెంట్ సకాలంలో చెల్లించడానికి టర్మ్ డిపాజిట్ చేయాలని బ్యాంకర్లు కోరతారు.
ఈ సందర్భాల్లో కస్టమర్‌కు సమాచారం ఇవ్వాలి
ఒకవేళ లాకర్‌ను షిప్ట్ చేయాలని బ్యాంకు నిర్ణయిస్తే సంబంధిత ఖాతాదారుకు ముందుగానే తెలియజేయాలి. లాకర్ డిపాజిట్ల రూమ్ వద్ద 180 రోజులు సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయాలి. ఇక మూడేండ్ల పాటు రెంట్ చెల్లించని డిపాజిట్ లాకర్లను తెరవాలా.. లేదా అని ఆ బ్యాంక్ అధికారులు నిర్ణయిస్తారు.
లాకర్ తెరవాలంటే..
మీరు బ్యాంకు లాకర్ తెరవాలంటే ముందుగా మీ సమీపంలోని బ్యాంకుల్లో డిపాజిట్ లాకర్లు ఖాళీగా ఉన్నాయా.. లేదా తెలుసుకోవాలి. లాకర్ ఉందని తెలిస్తే.. ఆ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకోవాలి. బ్యాంకర్లు డిపాజిట్ లాకర్లను నిర్వహించడానికి టర్మ్ డిపాజిట్ చేయాలని కోరతారు.

లాకర్‌కు నామినీ పేరు తప్పనిసరి
మీరు సింగిల్‌గా లేదా జాయింట్‌గా లాకర్ తెరిచినా నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. లాకర్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే సంబంధిత నామినీకి.. నామినీ లేకుంటే వారసులకు ఆ పత్రాలు, ఆభరణాలు అందజేస్తారు బ్యాంకర్లు. మీరు లాకర్ క్లోజ్ చేయాలని భావిస్తే సరెండర్ అప్లికేషన్ ఇస్తే సరి. లాకర్ ఖాళీ చేసిన తర్వాత దాని తాళంచెవి బ్యాంకర్‌కు ఇచ్చేయాలి.
ఎస్బీఐ లాకర్ల అద్దె ఇలా
దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ.. చిన్న డిపాజిట్ లాకర్లపై ఏడాదికి రూ.2000 అద్దె వసూలు చేస్తుంది. పట్టణాలు, మెట్రో ప్రాంతాల బ్యాంకుల్లో రూ.4,000 చెల్లించాలి. లార్జ్ లాకర్లలో రూ.8,000, ఎక్స్ట్రా లార్జి లాకర్లపై రూ.12 వేలు వసూలు చేస్తున్నది. వీటన్నింటికీ జీఎస్టీ కూడా వర్తింప జేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bank lockers
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

