Ashneer Grover | ఫిన్ టెక్ రంగంలోకి మళ్లీ అశ్నీర్ గ్రోవర్.. రూ.5 లక్షల వరకూ ప్రీ అప్రూవ్డ్ మెడికల్ లోన్..!
Ashneer Grover | భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్ తిరిగి ఫిన్ టెక్ రంగంలోకి ఎంటరయ్యారు.
Ashneer Grover | భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్ తిరిగి ఫిన్ టెక్ రంగంలోకి ఎంటరయ్యారు. ‘జీరోపే’ అనే మెడికల్ లోన్ యాప్ ద్వారా రెండోసారి అశ్నీర్ గ్రోవర్ ఫిన్ టెక్ రంగంలోకి అడుగు పెట్టారు. గూగుల్ ప్లే స్టోర్ లిస్టింగ్ ప్రకారం ‘జీరో పే’ యాప్ మూడు, ఆరు, తొమ్మిది, 12 నెలల టెన్యూర్ తో రుణాలు అందుకోవచ్చు. థర్డ్ యూనికార్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ‘జీరోపే’ యాప్ డెవలప్ చేసింది. అవసరమైన వారికి మెడికల్ లోన్లు ఇచ్చేందుకు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ముకుత్ ఫిన్ వెస్ట్‌తో జీరో పే భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. రూ.5 లక్షల వరకూ ప్రీ-అప్రూవ్డ్ మెడికల్ లోన్ పొందొచ్చు. భాగస్వామ్య దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది.

భారత్‌పే నుంచి నిష్క్రమించిన తర్వాత అశ్నీర్ గ్రోవర్ తన భార్య మాధురి జైన్ గ్రోవర్, చండీగఢ్ కేంద్రంగా పని చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త అసీం ఘావ్రీతో కలిసి 2023 జనవరిలో థర్డ్ యూనికార్న్ ప్రారంభించారు. క్రిక్ పే తో ఈ థర్డ్ యూనికార్న్ రంగంలోకి ఎంటరైంది. ఇది డ్రీమ్11, గేమ్స్24×7, మై 11 సర్కిల్ వంటి యాప్స్ తో పోటీ పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

