Investment Plan | పెట్టుబడి పథకాల్లో మదుపుతో బెస్ట్ రిటర్న్స్ .. అందుకు ఏం చేయాలంటే?!
Investment Plan | మెరుగైన రిటర్న్స్ కోసం మహిళలు సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. హెల్త్, జీవిత బీమా పాలసీలు తీసుకోవాలని చెబుతున్నారు.
Investment Plan | దేశీయ కార్మికుల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమేపీ పెరుగుతున్నది. ప్రొఫెషనల్ స్కిల్స్‌లోనూ తమకంటూ ప్రత్యేకత నిలుపుకుంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక వ్యవహారాల్లో చాలా నేర్పు, ఓర్పు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటి ఆర్థికాంశాలే కాక పొదుపు, పెట్టుబడి వంటి అంశాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఫైనాన్సియల్ ప్లానింగ్ లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు మహిళా మణులు. ఈ పరిస్థితుల్లో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.
సేఫ్టీ పొదుపు పథకాల వైపే మహిళలు మొగ్గు
డబ్బు ఖర్చు, పొదుపు అంశాల్లో అతివలు తమకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుని ముందుకు సాగుతారు. పెట్టుబడుల్లో నష్టాల పాలవుతామనే అభిప్రాయం పలువురు మహిళల్లో ఉందని నివేదికలు అంటున్నాయి. బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలనే ఇష్ట పడుతుంటారు. కానీ, ఈ పథకాలు దీర్ఘకాలిక సంపద స్రుష్టికి సరిపోవని, సందేహాలు పక్కనబెట్టి ఆదాయం పెంచే మార్గాలు ఉన్నాయా? అనే అంశంపై కేంద్రీకరించాలని చెబుతున్నారు.
ఫైనాన్సియల్ ప్లానింగ్ చాలా ముఖ్యం
కొన్ని స్పెషల్ అవసరాలు మినహా స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఫైనాన్సియల్ ప్లానింగ్ ఒకటే.. అదే సమయంలో ఫైనాన్సియల్ ప్లానింగ్ కోసం ఆర్థిక అక్షరాస్యత అత్యంత అవసరం. ఒక నివేదిక ప్రకారం దేశంలో 21 శాతం మంది మహిళలే ఆర్థికంగా అక్షరాస్యులుగా ఉన్నారు. ఫలితంగా సరైన పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక యావత్ ప్రపంచం మన చేతుల్లోనే ఉంది. మార్కెట్లో పలు రకాల పెట్టుబడి పథకాల గురించి తెలుసుకోవడానికి వార్తా పత్రికలు, వెబ్ సైట్లు, ఉచిత ఆన్ లైన్ కోర్సులు, వీడియోలు, ప్యాడ్క్యాస్ట్లు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పథకాల ఎంపికపై ఏమాత్రం సందేహాలు వచ్చినా క్లారిఫై చేసుకోవడానికి ప్రతి సంస్థ వద్ద హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. మీ ఫైనాన్సియల్ అవగాహన పెంచుకోవడానికి ఇవి ఉపకరిస్తాయి. డబ్బు నిర్వహణ మొదలు ఇంటి బడ్జెట్ రూపకల్పన, నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల సాధనకు మీ పెట్టుబడి ఎలా పెట్టాలన్నది తేలిగ్గా తెలుసుకోవచ్చు.
లైఫ్ అండ్ హెల్త్ బీమాకు ప్రాధాన్యం పెంచాలి
ప్రస్తుతం సొసైటీలో మహిళలు వంటింటి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ వంటి అంశాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. హెల్త్ బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తప్పనిసరిగా మహిళలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అనూహ్య అనారోగ్య సమస్యలు వస్తే సంబంధిత మహిళలు పొదుపు చేసిన మొత్తం నిధులు ఖర్చయిపోయే అవకాశం ఉందని, ఫలితంగా పూర్తిగా నష్టపోతారని చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే తప్పనిసరిగా హెల్త్ బీమా పాలసీ తీసుకోవాల్సిందే. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ప్రతి మహిళ తన కుటుంబ అవసరాలకు ఉపకరించే ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలని, అందుకు ఫైనాన్సియల్ ప్లానర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

