హైదరాబాద్, సెప్టెంబర్ 15: బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. వేతన జీవులకు 8.45 శాతం ప్రారంభ వడ్డీకే గృహ రుణం ఇవ్వనున్నట్లు తెలిపింది.
దీంతో లక్ష రూపాయల గృహ రుణంపై ఈఎంఐ రూ.729గా వసూలు చేస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్ 750 లేదా అంతకంటే క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి మాత్రమేనని షరతు విధించింది. నవంబర్ 12 లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ వడ్డీ వర్తించనున్నది. కేవలం రెండు రోజుల్లో గృహ రుణాన్ని మంజూరు చేయనున్న సంస్థ..తీసుకున్న రుణాన్ని 40 ఏండ్ల వరకు ఎప్పుడైన తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది.