కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు
- వారం రోజుల్లో 8 బిలియన్ డాలర్లు తగ్గుముఖం
- ఈ నెల 8 నాటికి దేశంలో ఉన్నది 580 బిలియన్ డాలర్లే
ముంబై, జూలై 15: దేశంలో విదేశీ మారకపు నిల్వలు భారీగా పడిపోతున్నాయి. ఈ నెల 8తో ముగిసిన వారం రోజుల్లో ఫారెక్స్ రిజర్వులు మరో 8.062 బిలియన్ డాలర్లు దిగజారాయి. దీంతో మొత్తం 580.252 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలియజేసింది. జూలై 1తో ముగిసిన అంతకుముందు వారంలోనూ ఫారెక్స్ నిల్వలు 5.008 బిలియన్ డాలర్లు క్షీణించిన విషయం తెలిసిందే. కాగా, ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)ల్లో పతనమే ఈ తరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నట్టు ఆర్బీఐ చెప్పింది. దేశీయ ఫారెక్స్ నిల్వల్లో ఎఫ్సీఏల వాటానే ఎక్కువ. తాజాగా క్షీణించిన రిజర్వుల్లో 6.656 బిలియన్ డాలర్లు ఎఫ్సీఏనే. ఇక మిగిలిన మొత్తం ఫారెక్స్ రిజర్వు (580.252 బిలియన్ డాలర్లు)ల్లో 518.089 బిలియన్ డాలర్లు ఎఫ్సీఏలే. కాగా, బంగారం రిజర్వులు 1.236 బిలియన్ డాలర్లు తగ్గి 39.186 బిలియన్ డాలర్లను తాకాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

