Kia Sonet facelift | 20 నుంచి కియా సొనెట్ ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్స్.. వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరణ
Kia Sonet facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా (Kia India) తన ఎస్యూవీ కియా సొనెట్ (Kia Sonet) అప్డేటెడ్ వర్షన్ కియా సొనెట్ ఫేస్‌లిఫ్ట్ కారును వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Kia Sonet facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా (Kia India) తన ఎస్యూవీ కియా సొనెట్ (Kia Sonet) అప్డేటెడ్ వర్షన్ కియా సొనెట్ ఫేస్‌లిఫ్ట్ కారును వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్)తో వస్తున్న కియా సొనెట్ ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
2019లో సెల్టోస్, 2020లో కార్నివాల్ ఎంవీపీ తర్వాత కియా మార్కెట్లోకి తెచ్చిన కారు సొనెట్.. కియా మోటార్స్ కార్ల విక్రయాల్లో కీలక భూమిక పోషిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో గల ప్రొడక్షన్ యూనిట్ ద్వారా సెల్టోస్, కార్నివాల్, సొనెట్ ఆవిష్కరించిన కియా ఇండియా.. సొనెట్ ఫేస్ లిఫ్ట్ కూడా ఇక్కడ నుంచే మార్కెట్లోకి తేనున్నది.
తాజా సొనెట్ ఫేస్ లిఫ్ట్ కారు ఎల్ఈడీ లైట్ బార్ కనెక్ట్ టూ టెయిల్ లైట్స్ ఉంటుంది. ఎనిమిది సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభించనున్నది. ఎక్స్ లైన్ వేరియంట్ టూ డ్యుయల్ టోన్ కలర్స్ లో వస్తుంది. ఆలీవ్, వైట్, సిల్వర్, గ్రే, బ్లాక్, రెడ్, బ్లూ, క్లియర్ వైట్, రెడ్ విత్ బ్లాక్ రూఫ్, వైట్ విత్ బ్లాక్ రూప్ డ్యుయల్ టోన్ కలర్స్ ఉంటాయి.
సొనెట్ ఫేస్ లిఫ్ట్ 10.25 అంగుళాల మెయిన్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 10.25 అంగుళాల ఎల్ సీడీ డ్రైవర్ డిస్ ప్లే యూనిట్ ఉంటాయి. ఈ కారు 360-డిగ్రీల కమెరా రేర్ వ్యూ, స్మార్ట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్, సెవెన్ స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, కియా కనెక్ట్ స్కిల్ విత్ అమెజాన్ అలెక్సా తదితర ఫీచర్లు ఉంటాయి.
ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్ , అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడాస్ ఫీచర్లతో వస్తోంది కియా సొనెట్ ఫేస్ లిఫ్ట్. కియా సొనెట్ ఫేస్ లిఫ్ట్ కారు రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118 బీహెచ్పీ విద్యుత్, 172 ఎన్ఎం టార్క్, 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 81 బీహెచ్పీ, 115 ఎన్ఎం టార్క్, 1.5 లీటర్ల సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఐఎంటీ, సెవెన్ స్పీడ్ – డీసీటీ యూనిట్ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

