Banking charges: 10 వేలకుపైగా డిపాజిట్ చేస్తే చేతిచమురు వదిలించుకోవాల్సిందే.. ఏ బ్యాంకులోనో తెలుసా..?
Banking charges: బేసిక్ సేవింగ్ ఖాతా కలిగిన వాళ్లు ఎంత మొత్తమైనా ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా క్యాష్ విత్‌డ్రాయల్స్‌లో నెలకు నాలుగు లావాదేవీలు ఉచితం. ఆపై ప్రతిలావాదేవీకి లావాదేవి విలువలో 0.50 శాతానికి లోబడి కనీసం

ముంబై: దేశంలోని పలు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు 2022, జనవరి 1 నుంచి సేవా రుసుముల్లో భారీ మార్పులు చేశాయి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) కూడా అలాంటి మార్పులే చేసి ఈ నెల 1 నుంచి అమలు చేసింది. కాబట్టి ఇప్పుడు ఐపీపీబీలో పరిమితికి మించి ఎలాంటి లావాదేవీలు జరుపాలన్నా అధిక చార్జీలు చెల్లించాల్సిందే. క్యాష్ డిపాజిట్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్ ఇలా సేవ ఏదైనా చేతిచమురు వదలాల్సిందే.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో బేసిక్ సేవింగ్ ఖాతా కలిగిన వాళ్లు ఎంత మొత్తమైనా ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా క్యాష్ విత్‌డ్రాయల్స్‌లో నెలకు నాలుగు లావాదేవీలు ఉచితం. ఆపై ప్రతిలావాదేవీకి లావాదేవి విలువలో 0.50 శాతానికి లోబడి కనీసం రూ.25 చార్జిచేస్తారు. సేవింగ్ ఖాతాదారులు (బేసిక్ సేవింగ్ ఖాతా కాకుండా) నెలలో రూ.25 వేలు ఎలాంటి చార్జీలు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై ప్రతి లావాదేవీకి దాని విలువలో 0.50 శాతానికి లోబడి కనీసం రూ.25 చార్జి చేస్తారు.
కరెంట్ బ్యాంకు ఖాతాదారులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. బేసిక్ సేవింగ్ ఖాతాదారులు తమ ఖాతాల్లో ఎంతయినా ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. సేవింగ్ ఖాతాదారులు మాత్రం రూ.10 వేల వరకు మాత్రమే ఉచితంగా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. అంతకుమించి డిపాజిట్ చేస్తే దాని విలువలో 0.50 శాతానికి లోబడి రూ.25 మొత్తం లావాదేవీ చార్జి వసూలు చేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

