న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాయల్ ఎన్ఫీల్డ్ తమ పాపులర్ మోటర్ సైకిల్.. క్లాసిక్ 350లో ఆల్ న్యూ వెర్షన్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఎక్స్షో రూం ప్రకారం దీని ప్రారంభ ధర రూ. 1.84 లక్షలుగా ఉన్నట్లు బుధవారం తెలిపింది. 2008లో క్లాసిక్ 350 మోడల్ విడుదలవగా, ఇప్పటిదాకా 30 లక్షలకుపైగా బైక్లు అమ్ముడయ్యాయి. 5 వేరియంట్లలో 11 కలర్లలో లభిస్తున్న ఈ బైక్ లు కస్టమర్లను ఆకర్షిస్తూ సంస్థకే మార్కెట్లో గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి.