అయ్యయ్యో.. అది జుట్టమ్మా!
‘అయ్యయ్యో... వద్దమ్మా... తెల్ల జుట్టునలా పీకేయకూడ దమ్మా... బోలెడు తెల్లవెంట్రుకలు వస్తాయమ్మా..! అయ్యయ్యో వద్దమ్మా... రోజూ తలకు పోసుకోకూడదమ్మా... జుట్టు రాలి పోతుందమ్మా... !’ అని ఎవరన్నా మీకు చెబితే...
‘అయ్యయ్యో… వద్దమ్మా… తెల్ల జుట్టునలా పీకేయకూడ దమ్మా… బోలెడు తెల్లవెంట్రుకలు వస్తాయమ్మా..! అయ్యయ్యో వద్దమ్మా… రోజూ తలకు పోసుకోకూడదమ్మా… జుట్టు రాలి పోతుందమ్మా… !’ అని ఎవరన్నా మీకు చెబితే… ‘సుఖీభవ!’ అని చెప్పి మీ పని మీరు చేసుకుపోండి. ఎందుకంటే ఇవన్నీ ఉత్త ముచ్చట్లే! ఇవే కాదు జుట్టుకు సంబంధించిన ఇలాంటి అపోహలు ఇంకా చాలానే ఉన్నాయి. ఓసారి చూడండి…
అపోహ: తెల్ల వెంట్రుకలను పీకితే ఎక్కువ అవుతాయి
వాస్తవం: తెల్లవెంట్రుకలు కనిపిస్తున్నాయి అంటే, తెల్లజుట్టు రావడం మొదలైందని అర్థం. అంటే మనం వెంట్రుకలు తీసేసినా, తీసేయక పోయినా అవి వస్తూనే ఉంటాయి. కాకపోతే అలా వెంట్రుకల్ని మాటిమాటికీ లాగడం వల్ల కుదుళ్లు దెబ్బతిని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు దాని చుట్టుపక్కల వెంట్రుకలూ రాలిపోయి పేను కొరుకుడులాంటి మచ్చలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.
అపోహ: రోజూ తలస్నానం చేయకూడదు
వాస్తవం: రోజూ తలస్నానం చేయడం తప్పేం కాదు, చేయడానికి వాడే షాంపూలతోనే అసలు సమస్య. సరైన షాంపూ వాడకపోతే తల పొడిబారిపోయి జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది. అదే ప్రకృతి సహజమైన ఉత్పత్తులతో చేసిన మైల్డ్ షాంపూ వాడితే నిశ్చింతగా రోజూ చేయవచ్చు. అందులోని సహజగుణాలు జుట్టుకు మేలు చేస్తాయి కూడా. అయితే రోజూ చేయాలా, వారానికోసారి చేయాలా అని కాకుండా అవసరాన్ని బట్టి తలస్నానం చేయడం మంచిది.
అపోహ: వెంట్రుకల చివర్లు మాటిమాటికీ కత్తిరిస్తే జుట్టు బాగా పెరుగుతుంది
వాస్తవం: వెంట్రుకలు కుదుళ్ల నుంచి పెరుగుతాయి. అందుకని తలపై చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే జుట్టు బాగా పెరుగుతుంది. కానీ చివర్లు కత్తిరించడం వల్ల కాదు. కాకపోతే చిట్లిన కొసలు ఉండటం వల్ల జుట్టు సన్నగా కనిపిస్తుంది. కత్తిరించినప్పుడు ఒత్తుగా అనిపిస్తుంది. అంతకుమించి కత్తిరించడం వల్ల జుట్టు పెరుగుతుందనడంలో వాస్తవం లేదు.
అపోహ: తల స్నానం చేశాక, జుట్టు ఆరేదాకా గట్టిగా టవల్‌తో తుడవాలి
వాస్తవం: తలస్నానం తర్వాత నీళ్లు లేకుండా తుండుతో కేశాలను మృదువుగా అద్దడం మాత్రమే చేయాలి. తర్వాత గాలికి ఆరేలా వదిలేయాలి. అంతేగానీ జుట్టు పొడిబారే వరకూ టవల్‌తో వెంట్రుకలను రుద్దడం వల్ల అవి చిట్లిపోయే ప్రమాదం ఉంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- hair
- white hair
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

