Beauty Tips | చిలగడదుంపల రుచి మనకు తెలుసు. అందులోని పోషక విలువలూ తెలుసు. దీంతో హెయిర్ మాస్క్ చేసుకోవచ్చనే విషయం మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. ఇందులోని విటమిన్ -ఎ కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్ కూడా.
ఒక చిలగడ దుంపను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుతోపాటు.. తేనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె.. ఒక్కో స్పూన్ చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా నూరి తలకు పట్టించుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.