నకిలీ మ్యాట్రిమోనితో మోసానికి గురైన మహిళ..నిందితుడి ఖాతాలోకి రూ. 48 లక్షలు బదిలీ
Fake matrimony| జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనిని ఆశ్రయించి మోసపోయిన మహిళ ఉదంతం ఏపీలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. దీంతో ఆమె పోలీసులకు
అమరావతి : జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనిని ఆశ్రయించి మోసపోయిన మహిళ ఉదంతం ఏపీలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేటకు చెందిన మహిళ నకిలీ మ్యాట్రిమోని వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుంది. ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ఆన్లైన్లో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
కొద్దిరోజుల తరువాత వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అమెరికాలో ఉంటానని నమ్మించి అక్కడికే రావాలని మహిళను నమ్మించాడు. అందుకు వీసా పంపడానికి డబ్బు పంపాలని కోరగా విడతల వారిగా ఆమె నింది తుడు శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్లోకి రూ. 48 లక్షలు పంపింది. అనంతరం అతడి నుంచి ఎలాంటి సమాచా రం రాకపోవడం, ఫొన్ స్వీచ్ఛాఫ్ వస్తుండడంతో మోసానికి గురైనట్లు గ్రహించి నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడి ఫొన్ నంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ప్రారంభించగా నిందితుడు విజయవాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు.
అతడు మ్యాట్రిమోనిలో ఫొటో, పేరు మార్చి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ప్రకాశం జిల్లాలోనూ ఇదే మాదిరిగా నిందితుడు మోసానికి పాల్పడి అరెస్టు అయిన్నట్లు గుర్తించి అతగాడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

