TS LAWCET | హైదరాబాద్ : ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీలాసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదల కానుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28వ తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చి మొదటి వారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదలకానుంది.
దీంతో పాటు బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ సైతం శుక్రవారమే విడుదలకానుంది. శుక్రవారం లాసెట్, ఈసెట్ సెట్ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. ఈనెల 10న టీఎస్ ఐసెట్, ఎడ్‌సెడ్ షెడ్యూల్స్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.