Tirupati | వైభవంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
Tirupati | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
తిరుపతి : తిరుచానూరు పద్మావతి (Padmavati) అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో ( spring festiva )భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్నపన తిరుమంజనం(Tirumanjanam) నిర్వహించారు.
పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు(Annamacharya Project) ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

