Tenali | ఎమ్మెల్యే-ఓటరు చెంపదెబ్బలు.. వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే శివకుమార్
Tenali | గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్ బూత్‌లో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటర్ మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఓటరు చెంపదొబ్బలు కొట్టుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్తుండగా గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Tenali | గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్ బూత్‌లో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటర్ మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఓటరు చెంపదొబ్బలు కొట్టుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్తుండగా గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టగా.. సుధాకర్ సైతం ఎమ్మెల్యేపై చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఎమ్మెల్యేలను పోలింగ్ ముగిసే వరకు గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అయితే, వ్యవహారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
పట్టణంలోని ఐతానగర్ పోలింగ్ స్టేషన్‌కు భార్యతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లానని.. అక్కడ భారీగానే క్యూ ఉందన్నారు. క్యూలైన్లో తన సామాజిక వర్గాని చెందిన సుధాకర్ అనే వ్యక్తి ‘ఇడుగో వచ్చాడయ్యా, మాల మాదిగ వర్గాలకు కొమ్ముకాసే ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి’ అంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడన్నారు. సదరు వ్యక్తిది ఐతానగరే అయినా.. ఉండేది బెంగళూరులోనేనన్నారు. అతడు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడేనని.. టీడీపీ, జనసేన నాయకులు కావాలనే.. ఇతర ప్రాంతాల్లో ఉండేవారని తీసుకువచ్చి ఓట్లు వేయించే ప్రయత్నంలో శాడిజంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సుధాకర్ మద్యం తాగి ఉన్నాడని.. తాను భార్యతో కలిసి ఓటేసేందుకు వెళ్తుంటే ‘ఎమ్మెల్యే అయితే ఏంటీ? క్యూలో రావాలి’ అంటూ మాట్లాడాడు’ అన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం ఓటేసి వచ్చారని.. ఆయన క్యూలో నిల్చున్నారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు నేరుగా వెళ్లి ఓటు వేయడం ఆనవాయితీ అన్నారు. అయితే, తన భార్య పక్కన ఉండగానే అసభ్యంగా దూషించాడని.. అక్కడున్న వారంతా ఆ మాటలు విన్నారన్నారు. అసభ్య పదజాలంపై చేయి చేసుకున్నది నిజమేనన్నారు. అయితే, పలు టీవీ ఛానెల్స్ రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని.. ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు వివరణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

