Indrakiladri | ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభం.. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ
Indrakiladri | విజయవాడ ఇంద్రకీలాద్రి పై శుక్రవారం నుంచి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
అమరావతి : విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై శుక్రవారం నుంచి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు (Shakambari festival) వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు.
తొలిరోజున 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో (Vegetables ) పాటు డ్రైఫ్రూట్స్, యాపిల్, నిమ్మ, యాలకులతో అమ్మవారిని అలంకరించారు. మల్లికార్జున మహా మండపంలో 180 మంది సిబ్బంది కూరగాయలను దండులుగా చేసి అమ్మవారికి అలకంరించారు. లోక కల్యాణంతో పాటు దేశంలో పంటలు బాగా పండాలని కోరుకుంటూ అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
శాకంబరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

