Donation | ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం
Donation | హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది.
తిరుమల : హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా ( Donation ) అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు ( Chairman BR Naidu) ఆ సంస్థ ప్రతినిధి బి.రమేష్ విరాళం డీడీని అందజేశారు.
మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో ( May Month) విశేష ఉత్సవాల వివరాలను అధికారులు వెల్లడించారు. మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం , సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహణ ఉంటుందని తెలిపారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుందని అన్నారు.
మే 2న ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ, 3న ఆలయంలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పుష్పయాగం, 12న పౌర్ణమి నాడు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, 18న అన్నమాచార్య కళామందిరంలో ఆస్థానం, 22న హనుమజయంతి , 27న సహస్ర కలశాభిషేకం, 30న పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

