నెల్లూరులో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభం
జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ ప్రహారి గోడ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులను బుధవారం ఏపీ మంత్రి అంబటి రాంబాబు...
నెల్లూరు: జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ ప్రహారి గోడ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులను బుధవారం ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు భగత్‌సింగ్ కాలనీలో ప్రారంభించారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో పెన్నా నదికి సమీపంలోని వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్ కాలనీ, తదితర ప్రాంతాలకు వరద ముప్పు నుంచి విముక్తి కలుగుతుందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
గతేడాది నవంబర్‌లో వరదలు వచ్చినప్పుడు నెల్లూరు నగరంలోని పెన్నా నదికి ఆనుకుని ఉన్న భగత్‌సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం తదితర కాలనీలు ముంపునకు గురైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఒకసారి రిటైనింగ్‌వాల్ నిర్మాణం పనులు పూర్తయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావన్నారు. ఈ కాంక్రీట్ గోడ కట్టిన తర్వాతే తమ పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఓట్లు అడుగుతారని చెప్పారు. సంగం, నెల్లూరు నగరం వద్ద పెన్నా నదిపై బ్యారేజీ పనులు తుదిదశకు చేరుకున్నాయని, వాటిని త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
నగరం సమీపంలో పెన్నా నదిపై త్వరలో మరో వంతెన రాబోతున్నదని మాజీ మంత్రి, నగర శాసనసభ్యులు పీ అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంతాల అవసరాలను తీర్చేందుకు రూ.8 కోట్ల అంచనా వ్యయంతో నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు, తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరినారాయణరెడ్డి, ఆర్డీఓ పీ కొండయ్య, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

