Girl Missing | ఇంకా కొలిక్కి రాని ముచ్చుమర్రి బాలిక ఆచూకి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన
Girl Missing | ఏపీలోని నంద్యాల జిల్లా ( Nandyala district) లో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం ఘటన తరువాత బాలిక అదృశ్యం కేసు ఇంకా కొలిక్కి రాలేదు.
అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా ( Nandyala district) లో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం ఘటన తరువాత బాలిక అదృశ్యం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. బాలికను అత్యాచారం చేసిన ముగ్గురు మైనర్లు చెప్పిన వివరాల ప్రకారం సమీప కాలువలో నాలుగురోజులుగా బాలిక ఆచూకి లభించ లేదు. ఎన్డీఆర్ఎఫ్ 9 NDRF) , ఎస్టీఆర్ఎఫ్(SDRF) , గత ఈతగాళ్లతో గాలించినప్పటికి ఫలితం లేకపోవడంతో శుక్రవారం గాలింపును నిలిపి వేశారు.
పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసు స్టేషన్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. బాలిక ఆచూకి వెంటనే కనుక్కోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈనెల 7 వ తేదీన ముగ్గురు మైనర్లు ఎనిమిదేళ్ల బాలిక (Girl) పై లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడి హత్య చేసి కాలువలో పడేశారు.
తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో మైనర్లు బాలికను చంపి హందీనివా అప్రోచ్ కాలువ సమీపంలో పడేశామని అంగీకరించడంతో మంగళవారం నుంచిగాలింపు చర్యలు మొదలు పెట్టారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన బాలిక ఆచూకి మాత్రం లభించలేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

