Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే సీఎం అని లోకేశ్ ప్రకటించారని గుర్తుచేసిన ఆయన.. చంద్రబాబు సీఎం కావడానికి అంగీకారం చెబుతున్నారా? అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. అనుభవజ్ణుడే సీఎం కావాలన్న లోకేశ్ మాటలను అంగీకరిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని జనసేన కార్యకర్తలు కంటున్న కలలు ఇప్పుడు ఏం కావాలని పవన్ కల్యాణ్‌ను హరిరామజోగయ్య నిలదీశారు. పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారని అడిగారు. ఈ ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తున్నామని.. రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నా అంటూ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు.